![]() |
![]() |
.webp)
ఒక సీరియల్ హీరోకి ఇంత క్రేజా.. వామ్మో ఏంట్రా ఇది అని అనుకుంటున్నారు మిగతా సీరియల్స్ అభిమానులు. అంతలా గుర్తింపు తెచ్చుకున్న నటుడు గుప్పెడంత మనసులోని రిషి అలియాస్ ముఖేష్ గౌడ.
తాజాగా విడుదలైన గుప్పెడంత మనసు ప్రోమోలో రిషి మాస్ లుక్ లో కన్పించాడు.కెజిఎఫ్, సలార్ రెండు కలిపి ఒకే స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుందో రిషిని చూస్తే అలా ఉందని ఈ సీరియల్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సీరియల్ లో గత కొన్ని నెలలుగా రిషి ఎంట్రీ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి కల నెరవేరింది. రిషి లేకుండా మను , ఏంజిల్ అంటు గత కొన్ని నెలలుగా కొనసాగించిన ఈ సీరియల్ ఇప్పుడు గాడిన పడనుంది. వసుధార రిషి కోసం దేవుడిని వేడుకుంటుంది. ఇక అప్పుడే కొంతమంది రౌడీలు వసుధారని వెంబడిస్తారు. వారిని తప్పించుకొని వసుధార పారిపోతుంటే రిషి తన చేతిని పట్టుకుంటాడు. ఇక అ రౌడీలని రిషి చితక్కొడతాడు. ఆ ఎలవేషన్స్, ఆ ఫైట్స్ చిన్నపాటి సినిమాని తలపించేలా అదిరిపోయే బిజిఎమ్ తో దించేశారు మేకర్స్.
ఇక గుప్పెడంత మనసు సీరియల్ కి మంచి రోజులు వచ్చాయి. రిషి, వసుధారల ఆన్ స్క్రీన్ జోడికి సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్ ఎక్కువే. ఇక నేటి నుండి గుప్పెడంత మనసు టీఆర్పీ కూడా పెరిగే అవకాశం ఉంది. మరి దర్శకుడు మను, ఏంజిల్ పాత్రలని ఎలా మారుస్తాడో చూడాలి. ఇన్నాళ్ళుగా శైలేంద్ర, దేవయాని, రాజీవ్ ల కుట్రలని ఒంటరిగా ఎదుర్కొన్న వసుధార నేటి నుండి రిషితో కలిసి ఎదుర్కోనుంది. ఇక నుండి కథనం ఎలా మారనుందో చూడాలి మరి.
![]() |
![]() |